Harry Potter Train : భద్రతా ప్రమాణాలపై అధికారుల సంతృప్తి.. మళ్లీ పట్టాలెక్కిన హ్యారీ పోటర్‌ రైలు!

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే హ్యారీ పోటర్‌ (Harry Potter) రైలు మళ్లీ పట్టాలెక్కింది. నవంబరు 30 వరకు ఈ రైల్వే సర్వీసులు (Railway services) కొనసాగనున్నాయి.

Published : 09 Aug 2023 17:19 IST

Image : westcoastrailways.co.uk

ఇంటర్నెట్‌ డెస్క్‌ : హ్యారీ పోటర్‌ (Harry Potter) రైలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘హోగ్వార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌’ (జాకోబైట్‌) తిరిగి పట్టాలెక్కింది. స్కాట్లాండ్‌లోని (Scotland) ఎత్తయిన పర్వతాలపై ఈ రైలు ప్రయాణం సాగుతుంది. మల్లాయిగ్ నుంచి ఫోర్ట్‌ విలియం వరకు రాకపోకలు సాగించే ఈ రైలు ప్రయాణం గ్లిన్‌ఫిన్నన్‌ వంతెనపై చూడముచ్చటగా కనిపిస్తుంది. దాంతో ఎక్కువ మంది పర్యాటకులు ఈ రైలులో ప్రయాణించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. సరైన భద్రతా నియమాలు పాటించడం లేదనే కారణంతో ఈ రైల్వే సేవలను ‘ద ఆఫీస్‌ ఆఫ్‌ రైల్‌ అండ్‌ రోడ్‌’ అధికారులు (ఓఆర్ఆర్‌) కొన్ని రోజుల క్రితం నిలిపివేశారు. తాజాగా లోపాలను సవరించడం పట్ల ఓఆర్‌ఆర్‌ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే సేవలను ఈ నెల 8 నుంచి నవంబరు 30 వరకు కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేశారు. 

మాస్కోలోని కర్మాగారంలో భారీ పేలుడు.. 25 మందికి గాయాలు

వెస్ట్‌కోస్ట్‌ రైల్వే నిర్వహిస్తున్న హ్యారీ పోటర్‌ రైలులో కొన్ని వారాల క్రితం అధికారులు భద్రతా తనిఖీలు చేశారు. సెకండరీ డోర్‌ లాక్‌ల చుట్టూ సమస్యలున్నట్లు వెల్లడైంది. దాంతో ప్రయాణికులు పడిపోయే ప్రమాదముందని నిర్ధారణకు వచ్చారు. కిటీకీల నుంచి బయటకు వాలుతున్న సమయంలో బయటి వస్తువులు తగిలే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ రైల్వే సేవలను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో వెస్ట్‌ కోస్ట్‌ రైల్వే కంపెనీ లిమిటెడ్ అవసరమైన మార్పులు చేసింది. వాటిని పరిశీలించిన ఓఆర్‌ఆర్‌ అధికారులు జాకోబైట్‌ సేవలు కొనసాగించడానికి పచ్చజెండా ఊపారు. సెంట్రల్‌ డోర్‌ లాకింగ్‌ లేకుండా హింగ్డ్‌ డోర్‌ క్యారేజీలు అమర్చిన రైళ్లకు తప్పనిసరిగా కొత్త నిబంధనలు వర్తిస్తాయని సందర్భంగా ఓఆర్‌ఆర్‌ స్పష్టం చేసింది. ముందస్తు బుకింగ్‌లు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హ్యారీ పోటర్‌ రైలు సర్వీసును పొడిగిస్తున్నామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని