Fire: మంటల్లో కాలిపోయిన భవంతులు.. నలుగురు మృతి, 14 మంది మిస్సింగ్‌

స్పెయిన్‌లో రెండు బహుళ అంతస్తుల నివాస భవనాలు మంటల్లో చిక్కుకుపోయిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి.

Published : 23 Feb 2024 16:39 IST

మాద్రీద్‌: స్పెయిన్‌లోని వాలెన్సీయా నగరంలో భారీ అగ్నిప్రమాదం (Valencia Fire Incident) చోటుచేసుకుంది. రెండు బహుళ అంతస్తుల నివాస భవనాలు మంటల్లో చిక్కుకుపోయిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మరో 14 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది క్రేన్ల సాయంతో పలువురిని రక్షించారు.

గూగుల్ ‘జెమిని’లో మోదీపై వివాదాస్పద సమాధానం.. కేంద్రం సీరియస్‌

తొలుత ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు సమాచారం. అగ్నికీలలు, పెద్దఎత్తున పొగ వెలువడుతోన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు, భవంతుల్లో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగా మంటలు వేగంగా విస్తరించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో షాంచేజ్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని