ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచండి

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తమ ప్రధాన ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. అధునాతన క్షిపణులతో పాటు ఇతర యుద్ధ ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు.

Published : 15 Aug 2023 05:14 IST

అధికారులకు కిమ్‌ ఆదేశం

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తమ ప్రధాన ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. అధునాతన క్షిపణులతో పాటు ఇతర యుద్ధ ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా సోమవారం తెలిపింది. యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఇటీవల అధికారులకు పిలుపునిచ్చిన కిమ్‌ ఇప్పుడు ఆయుధాల తయారీకి సంబంధించి కీలక ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా దక్షిణ కొరియా-అమెరికా దళాలు సంయుక్త సైనిక విన్యాసాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో కిమ్‌ ఆయుధ కర్మాగారాల సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆయుధాల విక్రయ నిమిత్తం కిమ్‌ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని