రూ.వందల కోట్లున్నా.. అమ్మాయి దొరకట్లేదు!

కాలిఫోర్నియాకు చెందిన సంపన్నుడు బ్రియాన్‌ జాన్సన్‌ (45) పద్దెనిమిదేళ్ల యువకుడిలా కనిపించేందుకు ఏటా రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నా.. తనకు తోడు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Published : 16 Aug 2023 04:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలిఫోర్నియాకు చెందిన సంపన్నుడు బ్రియాన్‌ జాన్సన్‌ (45) పద్దెనిమిదేళ్ల యువకుడిలా కనిపించేందుకు ఏటా రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నా.. తనకు తోడు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతడికి ప్రత్యేకంగా ఓ వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా రూ.కోట్లు ఖర్చుపెడుతున్న ఈ ధనవంతుడి వ్యవహారం ఇప్పటికే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అమితమైన సంపద, అందం రెండూ ఉన్నా ఏ మగువా ఎందుకు దగ్గరకావడం లేదంటే.. ఈయన పెట్టిన పది షరతులే కారణం. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన అనుభావాలను పంచుకున్న బ్రియాన్‌ ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని, భాగస్వామి దొరకడం కష్టమైన మాట నిజమేనని అంగీకరించాడు. ‘‘డేటింగుకు వెళదామనుకొన్నపుడు.. మొదట నేను ఓ జాబితా అమ్మాయి ముందుంచుతా. దాన్ని చూసి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నాకు ముడుచుకొని పడుకోవడం అలవాటు. భాగస్వామితో ఉన్నప్పుడు అలా ఉండలేం కదా. రోజుకు 111 మాత్రలు వేసుకుంటా’’ అని బ్రియాన్‌ జాన్సన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని