గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా భారత్‌ ఓటు

గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలనే డిమాండుతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ మద్దతు పలికింది.

Published : 14 Dec 2023 04:36 IST

ఐరాస: గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలనే డిమాండుతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ మద్దతు పలికింది. బేషరతుగా బందీలనూ విడుదల చేయాలని తీర్మానం కోరింది. మంగళవారం అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఐరాస నిర్వహించింది. అందులో ఈ తీర్మానం ప్రవేశపెట్టగా అద్భుత స్పందన వచ్చింది. తీర్మానానికి అనుకూలంగా 153 దేశాలు ఓటేశాయి. 10 వ్యతిరేకించాయి. 23 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇజ్రాయెల్‌, అమెరికా, ఆస్ట్రియా వ్యతిరేకంగా ఓటేసిన దేశాల్లో ఉన్నాయి. జర్మనీ, హంగరీ, ఇటలీ, ఉక్రెయిన్‌, బ్రిటన్‌ గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానాన్ని ఈజిప్టు ప్రవేశపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని