పాక్‌ ఉప ప్రధానిగా ఇశాక్‌ దార్‌

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇశాక్‌ దార్‌ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది.

Published : 29 Apr 2024 04:21 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇశాక్‌ దార్‌ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీకి చెందిన 73 ఏళ్ల ఇశాక్‌ ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఇశాక్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారు. ఈ సమయంలో తాజా ప్రకటన వెలువడింది. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఇశాక్‌ కుమారుడు అల్లుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని