పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు

పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.

Published : 11 May 2024 04:01 IST

అనుకూలంగా ఐరాసలో 143 దేశాల తీర్మానం
వ్యతిరేకించిన అమెరికా, ఇజ్రాయెల్‌

ఐక్యరాజ్యసమితి: పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా 143 దేశాలు ఓటేశాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ సహా 9 దేశాలు వ్యతిరేకించాయి. 25 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్‌లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినా.. అమెరికా వీటో చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని