అమెరికా ప్రముఖులకు మామిడి పండ్లు పంచిన భారత రాయబారి

చాలా ఏళ్ల తరవాత అమెరికా మార్కెట్‌లో తిరిగి దర్శనమిచ్చిన భారతీయ మామిడి పండ్లు భారత్‌-అమెరికా స్నేహ బంధ పటిష్టతకు, పరిపక్వతకు నిదర్శనాలని వాషింగ్టన్‌లో భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ

Published : 21 May 2022 05:09 IST

వాషింగ్టన్‌: చాలా ఏళ్ల తరవాత అమెరికా మార్కెట్‌లో తిరిగి దర్శనమిచ్చిన భారతీయ మామిడి పండ్లు భారత్‌-అమెరికా స్నేహ బంధ పటిష్టతకు, పరిపక్వతకు నిదర్శనాలని వాషింగ్టన్‌లో భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ పేర్కొన్నారు. గురువారం ఇక్కడి ఇండియా హౌస్‌లో అమెరికా ప్రముఖులకు మామిడి లస్సీ, బంగారు వన్నె మామిడి పండ్లను తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ పంచారు. ఈ భేటీలో అమెరికా వ్యవసాయ, వాణిజ్య, పశు, వృక్ష సంవర్థక శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. భారతీయ మామిడి, దానిమ్మ పండ్లకు అమెరికా మార్కెట్‌లో ప్రవేశం కల్పించాలనీ, అలాగే అమెరికన్‌ చెర్రీ, పంది మాంసానికీ భారతీయ మార్కెట్‌ లో అనుమతి ఇవ్వాలని గత ఏడాది భారత్‌-అమెరికా వాణిజ్య విధాన సంఘ సమావేశంలో నిర్ణయించారు. రెండు దేశాల వాణిజ్యం నిరుడు 16,000 కోట్ల డాలర్లకు చేరింది.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని