తైవాన్‌ చుట్టూ డ్రాగన్‌ భీకర విన్యాసాలు

తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న చైనా... తాజాగా సోమవారం ఆ ద్వీపం చుట్టూ భీకర సైనిక విన్యాసాలు చేపట్టింది. ఆరు యుద్ధనౌకలు, 22 యుద్ధ విమానాలు తమ

Published : 16 Aug 2022 05:48 IST

బీజింగ్‌, తైపీ: తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న చైనా... తాజాగా సోమవారం ఆ ద్వీపం చుట్టూ భీకర సైనిక విన్యాసాలు చేపట్టింది. ఆరు యుద్ధనౌకలు, 22 యుద్ధ విమానాలు తమ దేశం చుట్టూ చక్కర్లు కొట్టినట్టు తైవాన్‌ వెల్లడించింది. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని, తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జిన్‌పింగ్‌ సర్కారు స్వరం పెంచిన క్రమంలోనే... అమెరికా నుంచి రెండు ప్రతినిధి బృందాలు వరుసగా ఈ ద్వీపంలో పర్యటించడం డ్రాగన్‌కు పుండు మీద కారం చల్లినట్టయింది. తైవాన్‌ విషయంలో చైనా దూకుడు ప్రదర్శించి, ఏ క్షణమైనా ఆ ద్వీపాన్ని ఆక్రమించుకోవచ్చన్న ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్య స్పీకర్‌ నాన్సీ పెలోసీ నేతృత్వంలోని బృందం ఈనెల 2న తైవాన్‌లో పర్యటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ చైనా ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకూ ఆ ద్వీపం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది. తాజాగా డెమోక్రటిక్‌ సెనేటర్‌ ఎడ్‌ మార్కీ నేతృత్వంలోని బృందం ఆదివారం తైవాన్‌ చేరుకోవడంతో మళ్లీ విన్యాసాలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని