52 ఏళ్ల క్రితంనాటి రికార్డును తుడిచిపెట్టేయనున్న ఒరాయన్‌

జాబిల్లిపైకి మళ్లీ మానవులను పంపే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ఇటీవల ప్రయోగించిన ఒరాయన్‌ క్యాప్సూల్‌ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది.

Published : 26 Nov 2022 04:49 IST

వాషింగ్టన్‌: జాబిల్లిపైకి మళ్లీ మానవులను పంపే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ఇటీవల ప్రయోగించిన ఒరాయన్‌ క్యాప్సూల్‌ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. మానవ ప్రయాణానికి వీలుగా తయారై.. భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది చరిత్ర సృష్టించనుంది. శనివారంతో ఈ క్యాప్సూల్‌ మొత్తం 4,32,192 కిలోమీటర్లు ప్రయాణించినట్లవుతుంది. 52 ఏళ్ల క్రితం అపోలో-13 వ్యోమనౌక భూమి నుంచి 4,00,171 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. మానవసహిత ప్రయాణానికి అనుగుణంగా తయారై అత్యధిక దూరం ప్రయాణించిన ఘనత ఇప్పటివరకు దాని పేరు మీదే ఉండేది. తాజాగా ఆ రికార్డును ఒరాయన్‌ తుడిచిపెట్టేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని