Dubai Rains: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. భారత్‌-దుబాయ్‌ మధ్య 28 విమానాల రద్దు

Dubai Rains: భారీ వర్షాల కారణంగా భారత్‌-దుబాయ్‌ మధ్య విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దయ్యాయి.

Updated : 17 Apr 2024 13:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌ (Dubai) భారీ వర్షాల (Heavy Rains)తో స్తంభించిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల (Flights) రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే వాటిని దారిమళ్లిస్తున్నారు.

వర్షాల కారణంగా భారత్‌-దుబాయ్‌ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. మన సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లే 15, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్‌ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.

ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. బుధవారం కూడా వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని