Britain : చౌకైన లేజర్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ఆవిష్కరించిన బ్రిటన్‌

బ్రిటన్‌ కారు చౌకగా లేజర్‌ ఆయుధాన్ని తయారు చేసింది. దీనిని ఒక్కసారి వినియోగించడానికి అయ్యే ఖర్చు కేవలం 13 డాలర్లే. వాయుమార్గంలో ముప్పులను ఎదుర్కోవడంలో ఇది పెనుమార్పును తెస్తుందని భావిస్తున్నారు.  

Updated : 14 Mar 2024 13:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా గగనతలం నుంచి వచ్చే డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులు వంటి వాటిని ఎదుర్కొనడానికి వినియోగించే ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలు అత్యంత ఖరీదైనవి. వీటిల్లో వాడే ఒక్కో క్షిపణి ధర లక్షల డాలర్లలో ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా బ్రిటన్‌ అత్యంత చౌకైన లేజర్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను రూపొందించింది. పదిసెకన్ల పాటు వినియోగించే ఒక్క షాట్‌కు అయ్యే ఖర్చు 13 డాలర్లు (రూ.1,077) మాత్రమే..! అదే అమెరికా ప్రస్తుతం వినియోగిస్తున్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో ఒక్కో క్షిపణి ఖరీదు 2 మిలియన్‌ డాలర్లు. 

బ్రిటన్‌ రక్షణ శాఖ ఈ లేజర్‌ డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌కు ‘ది డ్రాగన్‌ ఫైర్‌’ అనే పేరుపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల వెల్లడించింది. జనవరిలో స్కాట్లాండ్‌ సమీపాన పరీక్షించినట్లు కొన్నాళ్ల కిందట ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇది పెనుమార్పులు తీసుకొస్తుందని రక్షణశాఖ అభిప్రాయపడింది. 

హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్‌ నౌక హైజాక్‌

సుదూర ప్రదేశాల్లో నాణెం అంత వస్తువును కూడా డ్రాగన్‌ ఫైర్‌ లక్ష్యంగా చేసుకోగలదని బ్రిటన్‌ తెలిపింది. కచ్చితంగా ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుందనే విషయం మాత్రం తెలియజేయలేదు. ఇది ఇనుము వంటి వాటిని గాల్లోనే కోసేస్తుందని వెల్లడించింది. వార్‌హెడ్‌లపై ఇది మంచి పనితీరును కనబరుస్తోందని పేర్కొంది.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఐరన్‌ బీమ్‌ పేరిట ఓ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఒక్కసారి దీనిని ఉపయోగిస్తే అయ్యే ఖర్చు కేవలం 2 డాలర్లే గతంలో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. త్వరలోనే దీన్ని సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు టెల్‌అవీవ్‌ యత్నాలు చేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు