Ebrahim Raisi: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చివరి క్షణాలకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రమాదానికి ముందు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పటి ఫొటో అది.

Published : 20 May 2024 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Iran President Ebrahim Raisi) హఠాన్మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన (Helicopter Crash) సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్‌లో ఉన్నవారంతా దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. కాగా.. ఈ ప్రమాదానికి ముందు రైసీ చివరి ఫొటో (Raisi Photo) ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

అధ్యక్షుడు రైసీ ఇతర అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రశాంతంగా కూర్చుని బయటకు చూస్తున్న చిత్రమది. ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో డ్యాంలను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడు తిరుగుపయనమైన దృశ్యాలను నిన్న ఇరాన్‌ మీడియా ప్రసారం చేసింది. ఆ స్క్రీన్‌షాట్లను పలు మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాయి. రైసీ బయల్దేరిన కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది.

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

ఇరాన్‌ కేబినెట్‌ అత్యవసర సమావేశం..

రైసీ మృతిపై ఇరాన్‌ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో దేశ కేబినెట్‌ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ మొఖ్బర్‌ తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ తర్వాత కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు