JP Morgan: మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ

భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు.

Published : 24 Apr 2024 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ (JPMorgan) సీఈఓ జేమీ డిమోన్ కొనియాడారు. ఎకనామిక్ క్లబ్‌ ఆఫ్ న్యూయార్క్‌ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలను ప్రశంసించారు.

అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్‌

‘‘భారత నాయకుడి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆయన తన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారన్నది యూఎస్ అధికారులు ఆలోచించుకోవాలి. మోదీ అద్భుతమైన పనితీరు చూపారు. 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. వారు మనతో వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు మనం వెళ్లి, ఉపన్యాసం ఇస్తాం. పనులు ఎలా చేయాలో పాఠాలు చెప్తాం. భారత్‌లో అద్భుతమైన విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే గతంలో వారికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. అవి అవినీతికి దారితీసేవి. ఆ సంక్లిష్టతను బ్రేక్‌ చేసి, పన్ను వ్యవస్థను సంస్కరించారు. భారత్‌లో ప్రతీ పౌరుడిని గుర్తించే వ్యవస్థ (ఆధార్‌) ఉంది. 700 మిలియన్ల బ్యాంకు ఖాతాలున్నాయి. సానుకూల మార్పు దిశగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వైఖరిని మన నేతలు పాటించాల్సిన అవసరం కాస్త ఎక్కువే ఉంది’’ అని అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని