Tsunami Threat: సునామీ ముప్పులో మరిన్ని దేశాలు.. జాబితా ఇదే

Eenadu icon
By International News Team Updated : 30 Jul 2025 09:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake In Russia) సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్‌ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అయితే, వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు (Tsunami Threat) పొంచి ఉంది. ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌ విడుదల చేసింది.

  • 3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు ఎగసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్‌, రష్యా, వాయువ్య హవాయి దీవులున్నాయి.
  • 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్‌ పాలినేషియా, గువామ్‌, హవాయి, జపాన్‌, జార్విస్‌ ఐలాండ్‌, జాన్‌స్టన్‌ అటోల్‌, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్‌, పాల్మిరా ఐలాండ్‌, పెరూ, సమోవా, సోలోమన్‌ దీవులు ఉన్నాయి.
  • 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్‌, కొలంబియా, కుక్‌ దీవులు, ఎల్‌ సాల్వడార్‌, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్‌, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌ తదితర దేశాలున్నాయి.
  • 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.

ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.

Tags :
Published : 30 Jul 2025 09:46 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు