Maldives: మొన్న చైనాతో సైనిక ఒప్పందం.. నేడు తుర్కియే నుంచి డ్రోన్లు..!

భారత్‌ను తీవ్రంగా వ్యతిరేకించే తుర్కియేతో ముయిజ్జు సర్కారు తాజాగా సంబంధాలను బలోపేతం చేసుకొంది. ఆ దేశం నుంచి నిఘా డ్రోన్లను కొనుగోలు చేసింది.  

Updated : 10 Mar 2024 10:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాల్దీవులు (Maldives) వేగంగా భారత వ్యతిరేక కూటమిలో చేరుతోంది. ఇటీవలే చైనాతో ఓ సైనిక ఒప్పందం చేసుకొంది. దీని వివరాలను గోప్యంగా ఉంచింది. తాజాగా తరచూ భారత్‌ను విమర్శించే తుర్కియే నుంచి డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటిని సముద్ర తీరంలోని తమ ఈఈజెడ్‌లో గస్తీ కాయడానికి ఉపయోగిస్తామని చెబుతోంది. వచ్చే వారంలో ఈ డ్రోన్ల వినియోగాన్ని ప్రారంభించనుంది. మొత్తం ఎన్నింటిని కొనుగోలు చేసిందో మాత్రం వివరాలు వెల్లడించలేదని ఆ దేశ మీడియా సంస్థ  పేర్కొంది. ఈ విషయంపై మాలె రక్షణ మంత్రిత్వ శాఖ లేదా విదేశాంగ శాఖ పెదవి విప్పడంలేదు. 

 అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చాక.. నిఘా డ్రోన్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ‘‘తుర్కియే కంపెనీతో చేసుకొన్న ఒప్పందంతో తొలిసారి మాల్దీవుల్లోకి సైనిక డ్రోన్లను తీసుకొచ్చారు. వీటిని దేశ సముద్ర తీరం పహారాకు వినియోగిస్తారు. మార్చి 3వ తేదీన ఆ కంపెనీ వీటిని డెలివరీ చేసింది. ప్రస్తుతం అవి ‘నూను మఫారు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు’లో ఉన్నాయి’’ అని ఓ ప్రభుత్వ అధికారి ఇచ్చిన సమాచారాన్ని ఆ పత్రిక ఉటంకించింది. ముయిజ్జు అధ్యక్షుడిగా నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పర్యటించిన దేశం తుర్కియే కావడం గమనార్హం. నాడు ఈ డ్రోన్ల కోసం ఒప్పందం చేసుకొన్నారు. వీటి కొనుగోలు కోసం కొన్ని రకాల దిగుమతి సుంకాల్లో మార్పులు చేశారు. ఈ డీల్‌ నిమిత్తం 37 మిలియన్‌ డాలర్లను ముయిజ్జు సర్కారు కేటాయించింది.  

నెతన్యాహుపై బైడెన్‌ ఆగ్రహం

చైనా పర్యటన నుంచి వచ్చిన తర్వాత నుంచి ముయిజ్జు భారత్‌ విషయంలో ఉపయోగించే భాషలో మార్పు వచ్చింది. ఆయన జనవరిలో ఎయిర్‌  మాట్లాడుతూ ‘‘మాది చిన్న ద్వీపాల సమూహమే అయినా.. దాదాపు 9 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ ఉంది.  ఈ సముద్రం ఎవరి సొత్తు కాదు’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నేటితో భారత సైనిక సిబ్బంది ఉపసంహరణకు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో డ్రోన్ల విషయం వెలుగులోకి రావడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు