Kenya: కెన్యా విద్యార్థుల వింత ప్రవర్తన.. మాస్‌ హిస్టీరియా కావొచ్చని అనుమానం!

కెన్యాలో (Kenya) ఓ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో వింత లక్షణాలు కనిపించాయి. 

Updated : 05 Oct 2023 18:21 IST

నైరోబి: వింత లక్షణాలతో బాధపడుతూ దాదాపు 100 కెన్యా (Kenya) విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. వారంతా కకామెగాలోని ఎరెగి బాలికోన్నత పాఠశాలకు చెందిన వారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆస్పత్రిపాలైన విద్యార్థులంతా నడవడానికి ఇబ్బంది పడుతూ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. మరికొందరిలో మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో విద్యార్థుల వింత ప్రవర్తనను చూసి కొందరు మాస్‌ హిస్టీరియా కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

నార్వే రచయితకు సాహిత్య నోబెల్‌

ఈ విషయం తెలిసి కెన్యా విద్యాశాఖ ప్రతినిధి ఒకరు పాఠశాలను సందర్శించారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పాఠశాలలోని మిగిలిన విద్యార్థులకు యథావిధిగా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ‘విద్యాశాఖ, ప్రజారోగ్య శాఖ, కౌంటీ ప్రభుత్వం సమన్వయంతో విద్యార్థులకు చికిత్సను అందజేస్తున్నామని’ విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్‌ జారేద్‌ ఒబిరో తెలిపారు. బాధిత విద్యార్థుల నుంచి సేకరించిన మూత్ర, రక్త నమూనాలను ల్యాబోరేటరీకి పంపించారు. వచ్చే వారంలో ఆ ఫలితాలు రానున్నాయి. అయితే, విద్యార్థుల అనారోగ్యానికి కారణం మాత్రం ఇప్పటివరకు వైద్యులకు అంతు చిక్కలేదు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని