Ishaq Dar: పాక్‌ ఉప ప్రధానిగా ఇశాక్‌ డార్‌ నియామకం

పాకిస్థాన్‌ ఉప ప్రధానిగా ఇశాక్ డార్‌ నియమితులయ్యారు.

Published : 28 Apr 2024 21:41 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan) ఉప ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇశాక్‌ డార్‌ (Ishaq Dar) నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్‌ డివిజన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయిన ఇశాక్‌ డార్‌ (73)ను ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఉప ప్రధానిగా నియమించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఇరాక్‌లో దారుణం.. సోషల్‌ మీడియా స్టార్‌ హత్య

షరీఫ్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన డార్‌ గతంలో రెండు సార్లు ఆర్థికమంత్రిగా సేవలందించారు. ఈ ఏడాది జరిగిన పాకిస్థాన్‌ జనరల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మద్దతుతో షెహబాజ్ షరీఫ్‌ నేతృత్వంలో పీఎంఎల్‌(ఎన్‌) ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటులో ఎగువ సభగా పేర్కొనే సెనేట్‌ ఛైర్మన్‌ పదవి బరిలో ఇశాక్‌ డార్‌ ఉన్నప్పటికీ  పీపీపీ, పీఎంఎల్‌(ఎన్‌) పార్టీల మధ్య కుదిరిన అధికార పంపిణీ ఒప్పందంలో భాగంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు. దీంతో పీపీపీ సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించగా.. డార్‌కు పాక్‌ విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన్నే ఉప ప్రధానిగా నియమించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని