Iraq: ఇరాక్‌లో దారుణం.. సోషల్‌ మీడియా స్టార్‌ హత్య

ఇరాక్‌లో సోషల్‌ మీడియా స్టార్‌గా పేరొందిన ఘఫ్రాన్‌ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు.

Published : 28 Apr 2024 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాక్‌లో (Iraq) దారుణం చోటుచేసుకుంది. సోషల్‌ మీడియా స్టార్‌గా పేరొందిన ఘఫ్రాన్‌ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్‌లోని ఆమె ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపారు. టిక్‌టాక్‌లో ఉమ్‌ ఫహాద్‌గా ప్రజాదరణ పొందిన ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

తూర్పు బాగ్దాద్‌లోని జయౌనా ప్రాంతంలోని ఆమె ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. బైక్‌మీద వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అయితే, నిందితుడు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు.

MH370 మిస్సింగ్‌లో ఏలియెన్స్‌ ఆధారాలు?.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..

గతంలో సఫాదీ చేసిన వీడియోలు వివాదాస్పదమయ్యాయి. నైతికత ఉల్లంఘన కింద ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన అనంతరం.. పాప్‌ మ్యుజిక్‌కు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇదిలాఉంటే, టిక్‌టాక్‌ వీడియోలతో పేరుపొందిన నూర్‌ అల్‌సఫర్‌ అనే యువతి కూడా 2023లో హత్యకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని