Pakistan PM: పాక్ ఆర్థిక కష్టాలు.. రెడ్ కార్పెట్‌కు గుడ్‌బై

Pakistan PM: సీనియర్‌ అధికారుల పర్యటనల సందర్భంగా రెడ్‌ కార్పెట్‌లు వేయడంపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నిషేధం విధించారు.

Updated : 31 Mar 2024 18:33 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్థాన్‌.. తమ ఆర్థిక అవసరాల కోసం అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు సూచించిన మార్గదర్శకాలను పాటించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగా మంత్రులు, సీనియర్‌ అధికారుల పర్యటనల సందర్భంగా ఏర్పాటు చేసే ఎర్ర తివాచీల వాడకానికి స్వస్తి పలికారు. వీటికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

అమెరికాలో వంతెనను ఢీకొన్న బార్జ్‌..!

అధికారిక కార్యక్రమాల్లో వినియోగించే ఎర్రతివాచీపై పాక్‌ ప్రధాని నిషేధం విధించినప్పటికీ..  విదేశీ అధికారుల పర్యటన సమయాల్లో ఈ సంప్రదాయం కొనసాగనుంది. రెడ్‌ కార్పెట్‌ వాడకాన్ని తొలగించడం ద్వారా నిధుల్ని ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. దేశ ఖజానాకు భారం కాకూడదని తమ జీతాలు, ప్రోత్సాహకాలను వదులుకొనేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేబినెట్ సభ్యులు సిద్ధమయ్యారు. దేశ ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడంలో భాగంగా పాక్‌ అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్దారీ జీతం తీసుకోనని గత నెలలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 2023లో పాక్‌ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) పేర్కొంది. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆరోగ్యం, ఆహారం.. లాంటి ప్రజల కనీస హక్కుల్ని పాక్‌ పాలకులు హరించివేశారని ఆక్షేపించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని