King Charle III: క్యాన్సర్‌ నిర్ధరణ తర్వాత.. తొలిసారి బయటకు వచ్చిన కింగ్‌ చార్లెస్‌ III

క్యాన్సర్‌ బారినపడిన బ్రిటన్‌ రాజు చార్లెస్‌ (King Charles III).. వ్యాధి నిర్ధరణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.

Published : 01 Apr 2024 00:02 IST

లండన్‌: బ్రిటన్‌ రాజు చార్లెస్‌ (King Charles III) క్యాన్సర్‌ బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన.. వ్యాధి నిర్ధరణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్‌ వేడుకల్లో భాగంగా విండ్సర్‌ క్యాజిల్‌లో పర్యటించి రాణి క్యామిల్లా (Queen Camilla)తో కలిసి అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు.

ఈస్టర్‌ వేడుకల్లో భాగంగా సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌కు వచ్చిన చార్లెస్‌ దంపతులు సాధారణ పౌరులతో ఉల్లాసంగా గడిపారు. తన మద్దతుదారులతో కరచాలనం చేస్తూ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. అభిమానులతో కబుర్లు కూడా చెప్పారు. ఆ సమయంలో ‘ధైర్యంగా ఉండండి’ (కింగ్‌ చార్లెస్‌ను ఉద్దేశిస్తూ) అంటూ అక్కడున్న జనం నినాదాలు చేయడం కనిపించింది.

కచ్చతీవు.. కథేంటి?అసలు ఎక్కడుంది ఈ దీవి?

ప్రిన్స్‌ విలియమ్‌, సతీమణి కేట్‌ మిడిల్టన్‌ మాత్రం ఈ సమయంలో కనిపించలేదు. కేట్‌ కూడా క్యాన్సర్‌ బారినపడినట్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఇటీవల ప్రకటించింది. సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిపింది. ఇలా రాజకుటుంబంలో ఇద్దరు క్యాన్సర్‌ బారినపడటం బ్రిటన్‌వాసులను ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే చార్లెస్‌ బాహ్య ప్రపంచంలోకి వచ్చి అక్కడి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని