Selfie: రైలుతో సెల్ఫీకి యత్నం.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాద దృశ్యాలు వైరల్‌

పట్టాలకు దగ్గరగా నిలబడి సెల్ఫీ దిగుతున్న యువతిని రైలు ఢీకొట్టింది. ఈ భయానక దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 07 Jun 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ‘సెల్ఫీ మోజు’ బలి తీసుకుంటోంది. ప్రమాదకర స్టంట్లు, సాహసాల పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ చారిత్రక రైలుతో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒక యువతి చనిపోయిన ఘటన మెక్సికో (Mexico)లో చోటుచేసుకొంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్లితే..

మెక్సికోలోని హిడాల్గో సమీపంలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు అనేకమంది ఔత్సాహికులు ట్రాక్‌ల వద్ద గుమిగూడారు. రైలు సమీపిస్తుండడంతో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇంతలో ఓ యువతి పట్టాలకు మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మీపై దాడికి ఇతరులకు ఆయుధాలిస్తాం.. పాశ్చాత్య దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి మృతిపై స్పందించిన కెనడియన్‌ పసిఫిక్‌ కాన్సాస్‌ సిటీ (CPKC) విభాగం విచారం వ్యక్తంచేసింది. రైలు వచ్చే ముందు ట్రాక్‌లకు కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలని.. పట్టాలపై నిలబడకూడదంటూ ఓ ప్రకటనలో సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని