250 మంది వైద్యులకు పదోన్నతులు

ప్రధానాంశాలు

250 మంది వైద్యులకు పదోన్నతులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) పరిధిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్లుగా పనిచేస్తున్న వైద్యులకు సోమవారం పదోన్నతులు లభించాయి. గత 8 ఏళ్లుగా ఈ క్యాడర్‌ వైద్యులు పదోన్నతులు లేకుండా సేవలు కొనసాగిస్తున్నారు. దీనిపై పలు సందర్భాల్లో టీవీవీపీ వైద్యులు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశారు.  తాజాగా పదోన్నతులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రక్రియను నిర్వహించి, 250 మందికి సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులుగా పదోన్నతి కల్పించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని, దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు పోస్టులు అందుబాటులోకి వచ్చాయని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.రమేశ్‌రెడ్డి తెలిపారు. 9 ఏళ్లు డిప్లొమా పీజీ.. 5 ఏళ్లు డిగ్రీ పీజీతో అనుభవం పొందిన వారందరూ ఈ పదోన్నతుల్లో అర్హత సాధించారని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని