Degree Lessons: డిగ్రీ పాఠాల్లో ‘ఈనాడు’ కథనాలు

ప్రధానాంశాలు

Degree Lessons: డిగ్రీ పాఠాల్లో ‘ఈనాడు’ కథనాలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థుల కోసం తెలుగు అకాడమీ రూపొందించిన తెలుగు సాహితీ దుందుభి పుస్తకంలో ‘ఈనాడు’ కథనాలకు చోటుదక్కింది. ‘జర్నలిజం మౌలికాంశాలు’ అనే పాఠంలో వీటిని పొందుపరిచారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరాలో లోపాలపై ఏప్రిల్‌ 8న ‘శుద్ధి జలం.. శుద్ధ అబద్ధం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించి ప్రజలకు స్వచ్ఛమైన నీరందేలా చర్యలు చేపట్టారు. పాఠ్యాంశంలో ఈ కథనాన్ని ప్రస్తావించడంతోపాటు రాసిన తీరునూ విశ్లేషించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి దీన్ని ఆవిష్కరించారు. ఒకట్రెండు రోజుల్లో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ‘ఈనాడు -ఆదివారం అనుబంధం’లో ప్రచురితమైన ‘శైలజా టీచర్‌.. జనం మెచ్చిన లీడర్‌’ కథన రచనలో ఎత్తుగడనూ ఇదే పాఠ్యాంశంలో ప్రశంసించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని