Kanigiri: ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యంత్రాలు లేక రోగుల అవస్థలు!

ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ యంత్రాలు మూలకు చేరి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated : 16 May 2024 13:20 IST

ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ (Dialysis) యంత్రాలు మూలకు చేరి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో 17 డయాలసిస్ యంత్రాలు ఉంటే 13 యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. 4 యంత్రాలతో మాత్రమే రోగులకు వైద్యం అందిస్తున్నారు. వైద్యం చేయించుకునేందుకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటల పాటు డయాలసిస్ చేయాల్సి ఉండగా వైద్యులు రెండు గంటలు మాత్రమే చేసి పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Tags :

మరిన్ని