Visakhapatnam: సాగర తీరంలో జెండా పాతేదెవరు?

రాష్ట్రంలో ఉన్న ఏకైక కాస్మోపాలిటిన్ పార్లమెంట్ నియోజకవర్గం విశాఖ. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారిని ప్రతినిధులుగా ఎన్నుకోవడం ఓటర్ల రాజకీయ పరిణతికి నిదర్శనం. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు రాజకీయాలన్నీ విశాఖ చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు.

Published : 28 Apr 2024 16:33 IST

రాష్ట్రంలో ఉన్న ఏకైక కాస్మోపాలిటిన్ పార్లమెంట్ నియోజకవర్గం విశాఖ. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారిని ప్రతినిధులుగా ఎన్నుకోవడం ఓటర్ల రాజకీయ పరిణతికి నిదర్శనం. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు రాజకీయాలన్నీ విశాఖ చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు. సాగర తీరంలో పర్యావరణ విధ్వంసం, ప్రభుత్వ భవనాల తాకట్టు, దసపల్లా భూముల కనికట్టు.. ఈ అరాచకాలన్నింటికీ ఓటర్లే మౌనసాక్షులుగా ఉన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామంటూ ఐదేళ్లు పబ్బం గడిపేసిన జగన్.. మరోసారి మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, మెట్రోప్రాజెక్టు ఇలా ఎన్నో అంశాలు ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తాయి.

Tags :

మరిన్ని