Ponnam: హామీల అమలుపై బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రతిసవాల్‌

కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) ప్రతి సవాల్‌ విసిరారు.

Published : 28 Apr 2024 13:59 IST

      కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) ప్రతి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకొంటానని బండి సంజయ్‌ చెప్పారని.. కేంద్రంలోని పదేళ్ల భాజపా పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో ఆయన చెప్పాలని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలుగుతారని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో భారాసకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సహా నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నం మాట్లాడారు.

Tags :

మరిన్ని