Russia: మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

నూతన సంవత్సర ప్రారంభంలో ఉక్రెయిన్‌ (Ukraine)పై రికార్డు స్థాయిలో ఒకేసారి 90 షాహెద్ రకం డ్రోన్లతో రష్యా (Russia) విరుచుకుపడింది. ఈ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మరణించాడని, ఏడుగురు గాయపడ్డారని సోమవారం ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే కీవ్ కూడా తమపై దాడులకు తెగబడిందని రష్యా ప్రకటించింది. మిలటరీ ఆస్పత్రిని సందర్శించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా సరిహద్దు ప్రాంతమైన బెల్గరోడ్‌లో శనివారం జరిగిన దాడికి ప్రతిగా ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ చేసిన ఈ దాడిలో సూమారు 24 మంది మరణించారని 100కు పైగా పౌరులు గాయపడ్డారని పుతిన్ పేర్కొన్నారు. 

Published : 02 Jan 2024 12:54 IST

Tags :

మరిన్ని