Yadadri: టీఎస్‌ఆర్టీసీ పెద్ద మనసు.. చిన్నారులకు ఉచిత బస్సు సౌకర్యం!

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విద్యార్థినులను పాఠశాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. యాదగిరిగుట్టలో షెడ్యూల్ కులాల ప్రభుత్వ బాలికల వసతిగృహంలో 89 మంది విద్యార్థినులు ఉన్నారు. వసతి గృహం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు.. ఉదయం, సాయంత్రం ఈ ఉచిత బస్సు నడుస్తోంది. వసతి గృహ సంక్షేమ అధికారిణి బి.సోని దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ బస్సు నడిపేలా చేశారు. ఈ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినందుకు, హాస్టల్ వార్డెన్‌, ఆర్టీసీకి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. 

Published : 11 Jul 2023 16:29 IST

Tags :

మరిన్ని