close

Published : 18/09/2020 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మ మాట మధురం

ఆ చిన్నారి నవ్వే అందుకు సాక్ష్యం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోసి నవ్వులు కురిపించే చిన్నారులు తమ తల్లుల మాటలను ఇట్టే గుర్తు పట్టగలరు. కల్మషం లేని కన్నతల్లి పిలుపునకు ముసిముసిగా నవ్వుతూ సందడి చేస్తారు. అలాంటి ఆత్మీయత, అనురాగాల మేళవింపే ఓ చిన్నారి నవ్వులు కురిపిస్తున్న ఈ వీడియో. హియరింగ్‌ ఎయిడ్‌ పెట్టుకున్న ఆ బాలుడు.. తన మాటలకు స్పందిస్తూ చిరు నవ్వులు చిందిస్తుంటే ఆ తల్లి గుండె ఎంత పులకించిపోయిందో ..!

మైసన్ మెక్‌కల్లమ్‌. ఏడాది వయసున్న చిన్నారి . అతడికి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల వైద్యులకు చూపించడంతో హియరింగ్‌ ఎయిడ్‌ పరికరాలను అమర్చారు. ఇప్పుడు మైసన్‌ తన మాటలు వినగలుగుతున్నాడని ఆ తల్లి ఎంతగానో మురిసిపోతోంది. ‘‘మై సన్‌  నా మాట వినిపిస్తోందా?’’అని ఆ తల్లి పిలుస్తోంటే.. మొదటిసారి తన తల్లి మాటను విన్న ఆ చిన్నారి నవ్వులు కురిపిస్తున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.  చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. వర్జీనియాలోని ఓ ఆసుపత్రిలో ఈ వీడియోను తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఇప్పటికే 4.5 మిలియన్ల మంది దీనిని వీక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.