ప్రభుత్వ పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్‌లు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపు కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 75 పాఠశాలలు ఇప్పటికే ఆసక్తి చూపాయని తెలిపింది. ‘‘వీటి వల్ల విద్యార్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య చర్యలపై అవగాహన కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) నుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా ఎనర్జీ క్లబ్‌ ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఆర్థిక సహకారం అందిస్తాం. ఈ క్లబ్‌ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు, డిబేట్లు, క్విజ్‌, సైన్స్‌ పోటీలు, నాటకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలోని 85 ఆదర్శ పాఠశాలల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇంధన సామర్థ్య ఉపకరణాలను ఏర్పాటు చేశాం. దీని వల్ల ఏటా 3.79 లక్షల యూనిట్ల విద్యుత్‌ పొదుపు చేయడం ద్వారా రూ. 23 లక్షలు ఆదా అయింది’’ అని పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని