Panda Dogs: శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం

చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Published : 11 May 2024 00:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా (China)లో ఓ విచిత్ర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జియాంగ్షు ప్రావిన్స్‌లోని ఓ జూ సిబ్బంది.. శునకాలకు పాండా (Panda) మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు స్థానికంగా వైరల్‌గా మారాయి. అయితే.. మరింత మంది సందర్శకులను ఆకట్టుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం కాస్త విమర్శలకు గురైంది.

‘చౌ చౌ’ జాతికి చెందిన రెండు శునకాలకు జెయింట్‌ పాండాల మాదిరి నలుపు, తెలుపు రంగులేసిన జూ సిబ్బంది.. టికెట్‌లపై ‘పాండా శునకాలు’ అనే పేరును పొందుపర్చారు. దీంతో అసలు ఏంటా జంతువు? అని ఆసక్తిగా వెళ్లిన సందర్శకులు.. తీరా అసలు విషయం తెలుసుకుని అసహనం వ్యక్తం చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.

ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్‌!

అయితే, తామేమీ సందర్శకులను మోసం చేయలేదని, అసలు విషయాన్ని టికెట్‌పైనే పొందుపర్చినట్లు జూ సిబ్బంది సమర్థించుకున్నారు. అదే సమయంలో సందర్శకుల సంఖ్య కూడా పెరిగినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమను తప్పుదోవ పట్టించారని కొంతమంది ఆరోపించారు. శునకాలకు రంగులేయడం జంతుహింసగా పరిగణించవచ్చా? అని ఒకరు ప్రశ్నించారు. అయితే.. ఈ జూలో అసలైన పాండాలు లేకపోవడం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని