close

తెలంగాణ

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ

ఉల్లంఘన ఫిర్యాదులపై చర్చ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వచ్చిన ఫిర్యాదులను చర్చించేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ గురువారం గాంధీభవన్‌లో సమావేశమైంది. కమిటీ ఛైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు కమలాకర్‌రావు, సంభాని చంద్రశేఖర్‌, శ్యాంమోహన్‌ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి సహకరించని, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదులు, తాజా పరిస్థితిపై చర్చించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు