బ్రేకింగ్

breaking
20 Apr 2024 | 19:58 IST

హైదరాబాద్‌ ఓపెనర్ల విధ్వంసం.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌

దిల్లీ: దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. దిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తున్నారు. పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ వికెట్‌ కోల్పోకుండా 125 పరుగులు చేసింది. అభిషేక్‌ (40*;10 బంతుల్లో 2×4, 5×6), హెడ్‌ (84*; 26 బంతుల్లో 11×4, 6×6) క్రీజులో కొనసాగుతున్నారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు. ఏడేళ్ల క్రితం బెంగళూరుపై కోల్‌కతా చేసిన 105 పరుగుల రికార్డు తాజాగా బద్దలైంది.

మరిన్ని

తాజా వార్తలు