భీమ్లా... నాయకి
close
Published : 31/07/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భీమ్లా... నాయకి

వన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌గా సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈసారి భీమ్లా నాయక్‌ పాత్రలో తన లెక్కేంటో చూపించనున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో పవన్‌తో పాటు, రానా కథానాయకులుగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులోనే పవన్‌ భీమ్లానాయక్‌గా నటిస్తున్నారు. రానాకి జోడీగా ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తోంది. పవన్‌కి జోడీగా నిత్యమేనన్‌ని ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని