కోహ్లీ... మళ్లీ! - icc rankings kohli stays on top of odi rankings bumrah slips to fourth
close
Published : 01/04/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ... మళ్లీ!

అగ్రస్థానం కైవసం చేసుకున్న ఛేదన రారాజు

దుబాయ్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. వన్డేల్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌ జాబితాలో తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. మరోవైపు పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఒక ర్యాంకు తగ్గి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీసులో కోహ్లీ (56; 66) వరుసగా రెండు అర్ధశతకాలు సాధించాడు. దాంతో 870 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. వివాహం వల్ల ఇంగ్లాండ్‌ సిరీస్‌కు దూరమైన బుమ్రా ఖాతాలో 690 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఇక హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మూడో ర్యాంకులో ఉన్నాడు. వరుసగా అర్ధశతకం, శతకం బాదేసిన కేఎల్‌ రాహుల్‌ 31 నుంచి 27వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ జాబితాలో 42వ ర్యాంకు దక్కించుకున్నాడు. అతడు 35, 64 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్‌ టాప్‌-100లో అడుగుపెట్టాడు.

పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొమ్మిది స్థానాలు మెరుగై 11వ ర్యాంకుకు ఎగబాకాడు. 2017 సెప్టెంబర్లో అతడు పదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇదే అత్యుత్తమ ర్యాంకు. ఇంగ్లాండ్‌తో ఆఖరి వన్డేలో భువీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. యువ పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్‌ జాబితాలో బెన్‌స్టోక్స్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకు సాధించాడు. శతక వీరుడు జానీ బెయిర్‌స్టో తిరిగి తన ఏడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇక టీ20ల్లో రాహుల్‌ కోహ్లీ ఒక్కో స్థానం దిగజారి 5, 6 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని