ఆర్‌ఆర్ఆర్‌ నుంచి చిన్న సర్‌ప్రైజ్‌ - ntr and ramcharan attend rrr practice sessions for the climax
close
Updated : 05/02/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఆర్ఆర్‌ నుంచి చిన్న సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిసి శత్రుమూకలను తుద ముట్టించేందుకు సాధన మొదలు పెట్టారు. అందుకు తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఏ దండును ఎలా మట్టి కరిపించాలో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది రామరాజు, భీమ్‌లు అంటే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ అని. ఈ స్టార్‌ హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఇటీవలే క్లైమాక్స్‌ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా, సినిమాకు సంబంధించిన విశేషాలను ‘ఆర్ఆర్ఆర్‌ డైరీస్‌’ పేరుతో నిత్యం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫొటోలను షేర్‌ చేసింది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ శక్తిమంతమైన క్లైమాక్స్‌ కోసం సాధన తరగతులు’’ అంటూ తారక్‌, చెర్రీ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ఉంచింది. ఆ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓలీవియా మోరిస్‌ ఫస్ట్‌లుక్‌ చిత్ర బృందం పంచుకుంది. ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నెమ్మదిగా ప్రమోషన్స్‌ను కూడా షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్‌, అలీ సన్‌ డూడీ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవీ చదవండి..!

నీ పవర్‌ ఇప్పుడు వాడు: మంచు లక్ష్మి

రివ్యూ:  జాంబీరెడ్డి

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని