Sainik schools: సైనిక్ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

సైనిక పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Updated : 22 Jan 2024 17:22 IST

దిల్లీ:  దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం జనవరి 28న (ఆదివారం) నిర్వహించే ప్రవేశ పరీక్షకు అడ్మిట్‌‌ కార్డులు విడుదలయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం(2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (AISSEE 2024) దరఖాస్తు చేసుకున్నవారు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్ష కోసం నవంబర్‌ 7 నుంచి డిసెంబర్‌ 20 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.  విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌  https://exams.nta.ac.in/AISSEE/ లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డు పొందొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని