TG TET: 80 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(టెట్‌) పరీక్షలు నిర్వహించనున్నారు. 

Published : 19 May 2024 21:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(టెట్‌) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టెట్‌ కన్వీనర్‌ ప్రకటించారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి జూన్‌ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతి రోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. వాటిలో అత్యధికంగా మేడ్చల్‌లో 25, రంగారెడ్డిలో 17 కేంద్రాలున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 20 వరకు టెట్‌కి దరఖాస్తులు స్వీకరించగా.. పేపర్‌ 1కి 99,958 మంది, పేపర్‌ 2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని