AP ICET and ECET Results: ఒకేరోజు ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?

ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ పరీక్షలను ఒకేరోజు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 29 May 2024 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఐసెట్‌ (AP ICET), ఈసెట్‌ ఫలితాల (AP ECET Results) విడుదలకు రంగం సిద్ధమైంది. మే 30న ఒకే రోజు ఈ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్‌-2024 ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు అనంతపురం- జేఎన్‌టీయూలో విడుదల చేయనున్నట్లు ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి వెల్లడించారు. మే 8న AP ECET పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ ఈసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అలాగే, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2024 ఫలితాలను (AP ICET Results) సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ వెల్లడించారు. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను results.eenadu.netలో చూడొచ్చు.

ఏపీ ఐసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని