Inter Hall Tickets: ఏపీలో ఇంటర్‌ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

ఏపీలో మార్చి 1 నుంచి జరగబోయే ఇంటర్‌ పరీక్షలకు హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated : 23 Feb 2024 18:01 IST

AP Inter Hall tickets | అమరావతి: ఏపీలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్‌ బోర్డు (AP Inter Board) హాల్‌ టిక్కెట్లను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 10 లక్షల మందికి పైగా విద్యార్థులు AP Inter Exams రాయనున్నారు. వీరిలో 5,29,457 మంది ప్రథమ ఇంటర్‌, 4,76,198 మంది విద్యార్థులు ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లు పొందేందుకు ఈ లింక్‌ https://bieap.apcfss.in/Index.do  క్లిక్‌ చేసి SSC Hallticket నంబర్‌, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్‌ చేయాల్సిఉంటుంది.

హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని