AP inter Marks: ఒక్క క్లిక్‌తో ఏపీ ఇంటర్‌ మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ ఇలా..

ఏపీలో ఇంటర్‌ ఫలితాలు ఇటీవల విడుదల కాగా.. తాజాగా విద్యార్థుల మార్కుల మెమోలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కింది ఇచ్చిన లింక్‌పై ఒక్క క్లిక్‌ చేయడం ద్వారా మీ మెమోలు పొందొచ్చు.

Updated : 16 Apr 2024 19:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (AP Inter Results) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,030మంది పరీక్షలు రాయగా.. ప్రథమ ఇంటర్‌లో 67%, ద్వితీయ ఇంటర్‌లో 78% ఉత్తీర్ణత నమోదైంది. అయితే, తాజాగా ఇంటర్‌ బోర్డు అధికారులు విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను (Marks memo) వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా మార్కుల వీటిని సులువుగా పొందొచ్చు. అందులో విద్యార్థి ఫొటోతో పాటు గ్రేడ్‌, సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి మీ మార్కుల షార్ట్‌ మెమోలు పొందండి.

Inter 1st Year మార్కుల మెమో కోసం క్లిక్‌ చేయండి

Inter 2nd Year మార్కుల మెమో కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని