AP Inter: నేడే ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో!

AP Inter Advanced Supplementary Result: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. 

Updated : 15 Jun 2023 16:30 IST

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష (AP Inter Advanced Supplementary Exams)ల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం (జూన్‌ 13న) సాయంత్రం 5గంటలకు ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌ బోర్డు (AP Inter board) మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసింది. ఇంటర్‌ రెగ్యులర్‌, ఒకేషనల్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేస్తారు. ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విద్యార్థులు తమ రిజల్ట్‌ను www.eenadu.net, https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రథమ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు


ద్వితీయ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు


ప్రథమ ఇంటర్‌ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు


ద్వితీయ ఇంటర్‌ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని