Inter results 2024: 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?

ఏపీలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల (AP Inter results 2024) ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్‌ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 12 Apr 2024 16:24 IST

Inter results 2024| అమరావతి: ఏపీలో ఇంటర్‌ పరీక్షల ఫలితాల (AP Inter Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి ఫస్టియర్‌కు 5,17,617, సెకండ్ ఇయర్‌కు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను www.eenadu.netలో చెక్‌చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని