Hall tickets: ఏపీ మోడల్ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు జరిగే పరీక్షకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Updated : 10 Apr 2024 20:31 IST

అమరావతి: వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25)గాను రాష్ట్రంలోని 164 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో (AP Model Schools) ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 21న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://cse.ap.gov.in/  లేదా  https://apms.apcfss.in వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని