AP SSC Hall tickets: ఏపీలో పదో తరగతి హాల్‌ టిక్కెట్లు 4న విడుదల

ఏపీలో మార్చి 18 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు సోమవారం విడుదల కానున్నాయి. 

Updated : 03 Mar 2024 18:59 IST

AP SSC Hall tickets | అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు (AP SSC Hall tickets) సోమవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12గంటల నుంచి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in ద్వారా విద్యార్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 

డౌన్‌లోడ్‌ ఇలా..

  • తొలుత ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.in సందర్శించండి
  • హోమ్‌ పేజీలో AP SSC హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్‌ చేయాలి
  • అక్కడ అడిగిన వివరాలు ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.
  • హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింటవుట్‌తీసి భద్రపరుచుకోండి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని