SGT Posts: ఆ అభ్యర్థుల ఫీజును రిఫండ్‌ చేస్తాం: ఏపీ విద్యాశాఖ

ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజును రిఫండ్‌ చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వెల్లడించారు.

Updated : 23 Feb 2024 21:43 IST

AP TET 2024 Exam | అమరావతి:  సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్‌ నంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

టెట్‌ హాల్‌ టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి

ఏపీ టెట్‌కు 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని,  వారి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ పరీక్షకు 120 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎస్జీటీ అభ్యర్థుల్లో 76.5శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యతా కేంద్రాన్నే వారికి కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఎవరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని వారు సంప్రదించాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం టెట్‌, డీఎస్సీ కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశామని.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవి పనిచేస్తాయన్నారు. హెల్ప్‌ డెస్క్‌కు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు ఇవే.. 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని