APEAPCET 2025 Top Rankers: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. టాప్‌-10 ర్యాంకులూ అబ్బాయిలవే!

Eenadu icon
By Features Desk Updated : 10 Jun 2025 17:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

గాంధీనగర్‌ (కాకినాడ): ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు(AP EAPCET 2025 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ - ఫార్మసీ పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. టాప్‌- 10 ర్యాంకర్ల జాబితాలో అందరూ అబ్బాయిలే ఉండటం గమనార్హం. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్‌ రెడ్డి ఒకటో ర్యాంకు (96.39 స్కోరు)తో సత్తా చాటగా.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్‌ రెడ్డి (95.57 స్కోరు)తో రెండో ర్యాంకు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ (94.75స్కోరు)తో మూడో ర్యాంకుతో మెరిశారు. (AP EAPCET 2025 Results)

  • యు. రామచరణ్‌ రెడ్డి - నాలుగో ర్యాంకు (తిమ్మాపురం, నంద్యాల జిల్లా)
  • భూపతి నితిన్‌ అగ్నిహోత్రి - ఐదో ర్యాంకు (అనంతపురం న్యూటౌన్‌) 
  • టి.విక్రమ్‌ లేవి - ఆరో ర్యాంకు (గుంటూరు)
  • దేశిరెడ్డి మణిదీప్‌ రెడ్డి - ఏడో ర్యాంకు (చిత్తూరు జిల్లా) 
  • ఎస్‌. త్రిశూల్‌ - ఎనిమిదో ర్యాంకు (వడ్డేపల్లి, హన్మకొండ)
  • ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి - తొమ్మిదో ర్యాంకు (నరసన్నపేట- శ్రీకాకుళం)
  • భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్‌ - పదో ర్యాంకు ( కందుకూరు- పొట్టిశ్రీరాములు నెల్లూరు)

అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో టాపర్లు వీరే..

1. రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్‌- (పెనమలూరు, కృష్ణా జిల్లా)

2. షన్ముఖ నిశాంత్‌ అక్షింతల - చందానగర్‌, రంగారెడ్డి జిల్లా

3. డేగల అకీరనంద వినయ్‌ మల్లేశ్‌ కుమార్‌ - ఆలమూరు, కోనసీమ

4. వై.షణ్ముఖ్‌ - వడ్డేపల్లి, హన్మకొండ

5. యెలమోలు సత్య వెంకట్‌ - తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి

6. సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్‌ - పెద్దాపురం, కాకినాడ

7. జి. లక్ష్మీ చరణ్‌ - సీతమ్మధార, విశాఖ

8. దర్భ కార్తిక్‌ రామ్‌ కిరీటి- రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి

9. కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ - చాగళ్లు, తూర్పుగోదావరి

10. దేశిన సూర్య చరణ్‌ - తొండంగి, కాకినాడ


Published : 08 Jun 2025 18:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని