AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల రీషెడ్యూల్‌.. కొత్త డేట్స్‌ ఇవే..

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలు ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Published : 20 Mar 2024 22:22 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలు ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్‌ చేశారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2024) పరీక్ష షెడ్యూల్‌లో మార్పు చేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 13 నుంచి 19వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్ష మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్ పరీక్ష మే 18 (సెషన్‌-1), 19(సెషన్‌ -2), 20, 21, 22 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.  అలాగే, ఏపీ పీజీసెట్‌ పరీక్ష జూన్‌ 3 నుంచి 7 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని జూన్‌ 10, 11, 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌కు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ పరీక్షలను మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ నజీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని