APPSC DL Recruitment: డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు పెరిగాయ్‌.. దరఖాస్తులు షురూ

ఏపీలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Updated : 24 Jan 2024 17:36 IST

APPSC Degree Lecturer Recruitment 2024| అమరావతి: ఏపీలో డిగ్రీ కళాశాలల్లో 290 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఫిబ్రవరి 13 అర్ధరాత్రి 11.59 గంటల వరకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్‌ 30న మొత్తం 240 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తాజాగా మరో 50 పోస్టులను పెంచుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు.. 

  • సబ్జెక్టుల వారీగా పోస్టుల ఖాళీలివే..: బయోటెక్నాలజీ 4, బోటనీ 20, కెమిస్ట్రీ 23, కామర్స్‌ 40, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 49, కంప్యూటర్‌ సైన్స్‌ 48, ఎకనామిక్స్‌ 15, ఇంగ్లిష్‌ 5, హిస్టరీ 15, మేథమేటిక్స్‌ 25, మైక్రోబయోలజీ 4, పొలిటికల్‌ సైన్స్‌ 15, తెలుగు 7, జువాలజీ 20 చొప్పున మొత్తం 290 పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.57,700 -రూ.1,82,400 వరకు వేతనం ఉంటుంది.
  • వయో పరిమితి: 2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ కేటగిరీకి చెందినవారికి మూడేళ్లు చొప్పున వయో సడలింపు కల్పించారు. 
  • దరఖాస్తు రుసుం: అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.250తో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌, తెల్లరేషన్‌ కార్డు కలిగిన మహిళలతో పాటు మరికొందరికి ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు. 
  • పరీక్ష విధానం, మార్కులు ఇలా..: డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్‌- 1 జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్‌)తో ఉంటుంది. 150 ప్రశ్నలకు 150 మార్కులు. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు. అలాగే,  అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుపైనే పేపర్‌- 2 పరీక్ష (పీజీ స్టాండర్డ్‌తో) ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్‌ మార్కు ఉంటుంది.
  • ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, సబ్జెక్టుల వారీగా పరీక్ష సిలబస్‌, కేటగిరీలు, జోన్‌లవారీగా పోస్టులు.. తదితర పూర్తి వివరాలను ఈ కింద పీడీఎఫ్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని